ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టి వ్ గవర్నెన్స్ విధానంలో పాలనను సరళీకరణ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే అంశంపై ఫోకస్ చేస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అంతే కాదు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో నిధు లు గల్లంతైన విధానంపై కూడా దృష్టి పెట్టారు. స్వచ్ఛాంధ్ర నిధుల పక్కదారి పట్టడంపై పవన్ కళ్యాణ్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదొక్కటే కాదు అన్ని పథకాల పైనా ఇదే తరహాలో ముందుకె ళ్తోంది ఏపీ సర్కారు. వైసీపీని రాజకీయంగా కాకుండా చట్టపరంగానే దెబ్బకొట్టాలని అధికార పక్షం యోచి స్తున్నట్లు కనిపిస్తోంది.