ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సుప్రీంలో కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.బెయిల్‌పై హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆగాల్సిందే అని సుప్రీం తెలిపింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఎల్లుండి విచారిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు తీర్పు ఇచ్చింది. బెయిల్ మంజూరును వ్యతిరేకిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుపై స్టే విధించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ ఉత్తర్వులు వచ్చే వరకు ఇంప్లీడ్ ఆర్డర్ అమలును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హైకోర్టు బెయిల్ పై స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.