తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ప్రజలు.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 24.31 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతు న్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 13.22శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 5.06శాతం పోలింగ్ నమోదైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. కొడంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత, కూతురుతో కలిసి ఓటు హక్కు వినియో గించుకున్నారు. కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటేశారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ స్వగ్రామం చింత మడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు నాయకులు ఉన్నా రు.
బంజారాహిల్స్‌లోని నందీనగర్‌లో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో మాజీ మంత్రి కేటీఆర్ ఓటే శారు. కుమారుడు హిమాన్షు, సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ప్రజలందరూ బయటకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు. మంచి ప్రభుత్వా లను, మంచి నాయకులను, సమస్యలకు ప్రాతినిథ్యం వహించే వారికి ఓటెయ్యాలని సూచించారు. ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని అన్నారు.
సిద్దిపేటలో మాజీమంత్రి హరీష్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే పట్టణాల్లో పోలింగ్ శాతం పెరుగుతోందని. మేధావులు, విద్యావంతులు పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఓటు వేయాలని హరీష్ రావు కోరారు. హైదరాబాద్ పాతబస్తీలో మందకొడిగా పోలింగ్ సాగుతోంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి ఓటు వేశారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ములుగు జిల్లా జగ్గన్నపేట లో మంత్రి సీతక్క, సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నా బాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఓటేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదే పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌లో సినీనటుడు చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలక్‌పేటలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, మేడ్చల్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి, పూడూరులో ఈటల రాజేందర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


