తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడోచోట పోలీసుల తనిఖీల్లో మద్యం బాటిళ్లు కుప్పలుతెప్పలుగా పట్టుబడు తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా తిప్పనగుంటలోని ఓ రైస్ మిల్లులో దొరికిన మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన వారు వైసీపీ నాయకులుగా గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.