ఓటింగ్ శాతంపై తెలుగు రాష్ట్రాల ఈసీ అధికారుల్లో ఆందోళన నెలకొంది. మొదటి మూడు విడతల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. వచ్చే సోమవారం దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో నాలుగో విడత పోలింగ్ జరగనుంది. నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో 80, తెలంగాణలో 62 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ సినీ హీరోలు, ప్రముఖులతో ప్రచారాలు చేయిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.