హైదరాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో మాధవీలత పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు. మాధవీలతా ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అద్భుతంగా ఉందని తెలిపారు. చాలా కీలక అంశాలను మీరు ఇందులో లేవనెత్తారని ప్రశంసించారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. ఈ ఎపిసోడ్ పునఃప్రసారాన్ని అందరూ చూడా లని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొంపెల్ల మాధవీలతకు ఈ సారి బీజేపీ తరుపున హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్రం వై-ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది.


