తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం కావడంతో తెలంగాణలో భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి. రెండు నెలల్లో భూగర్భ జలాలు దాదాపు 2 మీటర్లు లోతుకు వెళ్లాయి. గత ఏడాది మార్చ్‌తో పోలిస్తే భూ ఉపరితల నీటి మట్టం 1.67 మీటర్లు పెరిగింది. నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నీటి మీట్టం పెరిగింది. ఏప్రిల్, మే నెలలో భూగర్భ జలం మరింత లోతుకు చేరుకోనుంది. గ్రౌండ్ వాటర్ తగ్గడంతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లకు ఇప్పటికే డిమాండ్ పెరిగిపోతోంది. రాబోయే రెండు నెలలు నీళ్ల తిప్పలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.


