కాంగ్రెస్‌లోకి వలసలు పెరిగాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో.. సొంత పార్టీ నేతలు వలసలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా… స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు. కడియం చేరికతో కష్ట పడే కార్యకర్తలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కడియం కాంగ్రెస్‌లో చేరితే… ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాతే ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నికల్లో సింగాపురం ఇందిరను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాని అన్నారు.


