ఏపీ టీడీపీలో టిక్కెట్ వార్ కొనసాగుతోంది. తన సీటు బాలసుబ్రమణ్యానికి ఎలా ఇస్తారని…రాజంపేట ఇన్‌ఛార్జ్ చంగల్ రాయుడు అధిష్టానాన్ని ప్రశ్నించారు. రాజంపేట పార్లమెంట్ టిక్కెట్ బాలసుబ్రమణ్యానికి ఇస్తానని చెప్పి..ఆ సీటు కిరణ్‌కుమార్ రెడ్డికి కేటాయించి తన సీటు అతనికి ఎలా ఇస్తారని నిలదీశారు. ఐదేళ్లపాటు కష్టకాలంలో తన దగ్గర పని చేయించుకొని…చివరి నిమిషంలో టిక్కెట్ కేటాయించకుండా ఉండ డానికి కారణాలెమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తన నెత్తిన బంగారు కిరీటం పెట్టి బుజ్జగించినా తనకు ఎమ్మెల్యే టిక్కెట్టే కావాలని అంటాను తప్ప…వేరే ఆఫర్లకు ఎంత మాత్రం అంగీకరించనని సమాధానం ఇచ్చారు రాయుడు.


