గొర్రెల పంపిణీ కేసులో మరో మలుపు తిరిగింది. గొర్రెల పంపిణీ అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ కు హస్తం ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగరు ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ… మూడు రోజుల పాటు విచారించి కీలక విషయాలను రాబట్టింది. విచారణలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. రికార్డ్ ల్లోకి బినామీ ఖాతాల వివరాలను జేడీ ఎక్కించినట్లు గుర్తించారు. మొయినుద్దీన్ నుండి లక్షల రూపాయలు తీసుకు న్నట్లు తెలుస్తోంది. రైతుల డబ్బులు కొట్టేసి విదేశాల కు పారిపోయిన మోయినుద్ధిన్, అతడి కుమారుడు ఇక్రం జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు ఇచ్చి విచారిం చనుంది ఏసీబీ.


