కొన్నిరోజుల క్రితం నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన AIADMKమాజీ నాయకుడు ఏవీ రాజుకు త్రిష లాయర్ నోటీసు పంపారు. త్రిష ట్విట్టర్ ద్వారా లీగల్ నోటీసుల ఫోటోలను షేర్ చేసింది. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులి చ్చి రిసార్ట్‌కు తీసుకొచ్చారంటూ ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన కామెంట్లను కోలీవుడ్ సినీ తారలంతా మూకుమ్మడిగా ఖండించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏవీ రాజుపై త్రిష న్యాయపోరాటానికి దిగారు.