ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో కల్కి ధామ్ మందిరానికి శంకుస్థాపన కార్యక్ర మంలో పాల్గొన్నారు. కల్కి ధామ్ మందిరం నమూనాను సాధువులు ప్రధానికి అంద జేశారు. ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ గత పదేళ్లలో భారత్ అభివృద్ధిలో కొత్త పంథాలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రధాని కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణ ప్రధానికి స్వాగతం చెప్పారు. 18 ఏళ్ల క్రితం కన్న ‘సనాతన ధర్మం’ కలనుసాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది సాధువులు ఈ సందర్భం గా హాజరయ్యారని వారందరికీ స్వాగతం చెబుతున్నామన్నారు ప్రమోద్ కృష్ణ. ప్రధాని ఉత్తరప్రదేశ్ లో దాదాపు పదిలక్షల కోట్ల 14 వేల ప్రాజెక్టులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల 33 లక్షల 50 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఉత్పత్తి, పునర్వినియోగ ఇంధనం, సమాచార టెక్నాలజీ, గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు వస్తాయి.


