స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రస్తుత వరల్డ్ కప్ తనకు ఆఖరిదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మెగా టోర్నీ టీమ్‌లోకి ఆలస్యంగా వచ్చినందుకు తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయంతో మెగా ఈవెంట్‌కు దూరం కావడంతో అతని ప్లేస్‌లో అశ్విన్‌ను తీసుకున్నారు. ‘నాకు ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావొచ్చు. అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. నిజాయితీగా చెప్పాలంటే నేను ఇక్కడ ఉంటానని అనుకోలేదు. కానీ పరిస్థితులు అలా కలిసి వచ్చాయి. టీమ్ మేనేజ్‌మెంట్ నాపై నమ్మకం ఉంచింది. టీమ్‌లోకి ఆలస్యంగా రావడంపై నాకు ఎలాంటి బాధ లేదు. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదించడమే నాకు తెలుసు. గత నాలుగైదేండ్లుగా ఇలాంటి ఆటతీరునే ప్రదర్శిస్తున్నా’ అని ఇంగ్లండ్‌తో వామప్ మ్యాచ్‌కు ముందు అశ్విన్ పేర్కొన్నాడు.