పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు.. ఆయన పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదు అని హితవుపలికారు పవన్ కల్యాణ్.. చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించింది.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. వైసీపీ, ప్రభుత్వం, పోలీసులు ఊరుకోమని అంటున్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా..? అధికార పార్టీకి సంబంధం ఏమిటి..? అని నిలదీశారు. నేడు ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణంగా వైసీపీ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.
ఒక నాయకుడు అరెస్టు అయితే.. అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి రావడం సహజం.. మీ నాయకులు అక్రమాలు చేయవచ్చు, దోపిడీలు చేయవచ్చు.. అయినా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.. కానీ, వారి నాయకులను అరెస్టు చేస్తే.. ఇంట్లో నుంచి బయటకు రానీయకూడదంటే ఎలా..? అంటూ మండిపడ్డారు పవన్.. లా అండ్ ఆర్డర్ కంటే కూడా.. ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నాం అన్నారు. చంద్రబాబు వీటి నుంచి బయటపడాలని జనసేన సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుందని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..