Nara Lokesh: జగన్ కు దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై ఉండదు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జగన్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ.. రైతుల సమస్యలపై ఉండదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) అన్నారు. పల్నాడు జిల్లా గురజాల (Gurajala) నియోజకవర్గంలో జూలకల్లు శివారు క్యాంప్‌ సైట్‌ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా జూలకల్లు గ్రామస్థులను లోకేశ్‌ కలిసి మాట్లాడారు. ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్‌ కూడా పెట్టలేని దిక్కుమాలిన ప్రభుత్వమిదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక సాగర్‌ కాల్వలను ఆధునికీకరిస్తాం.. చివరి భూములకు నీరందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

జూలకల్లులో సాగర్‌ కుడి కాల్వ వద్ద నారా లోకేశ్‌ సెల్ఫీ ఛాలెంజ్‌ (Selfie Challenge) విసిరారు. ‘‘నిర్వహణ లేక గేట్లు శిథిలావస్థకు చేరి.. నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అన్నమయ్య, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. పులకేసి పాలనలో రాష్ట్ర ప్రజలు ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలో అని లోకేశ్‌ ఎద్దేవా చేసారు.

Latest Articles

మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్