స్వతంత్ర వెబ్ డెస్క్: బ్రిటన్‌లో వారం రోజుల వ్యవధిలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి హత్యకి గురయ్యాడు. క్యాంబర్‌వాల్‌లోని సౌతాంప్టన్ వేలో ఓ నివాస సముదాయంలో కత్తిపోట్ల గాయాలతో పడి ఉన్న అరవింద్ శశికుమార్ అనే 38 ఏళ్ల వ్యక్తిని మెట్రో పోలీసులు గుర్తించారు. కేరళకి చెందిన శశికుమార్‌తో కలిసి ఉండే సల్మాన్ సలీమ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. శశికుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఛాతిపై కత్తిపోట్ల కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. క్యాంబెర్‌వెల్ ఎంపీ హారిట్ హార్మన్ మాట్లాడుతూ దీనిని ఒక భయానక ఘటనగా అభివర్ణించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.


