స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో ఇన్ని రకాల పథకాలు ఉన్నాయి.. అవేమైనా సక్రమంగా ఉన్నాయా? అవినీతి ఏ విధంగా ఉంది. రైతులకు ఎలా సహాయ పడుతున్నాము. యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామా? అంటూ తాజా రాష్ట్ర పరిస్థితులపై స్పందించారు మాజీ ముఖ్య మంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి. విశాఖ సర్క్యూట్ హౌస్ లో మీడియా తో మాట్లాడుతూ.. నా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగం రాక పోతే మూడేళ్ళలో 6.60 వేల ఉద్యోగాలు ఇచ్చానని అన్నారు. బిపియల్ కుటుంబాలకే ఉద్యోగాలు ఇచ్చామన్న నల్లారి.. అందులో 1.60 ఉద్యోగాలు ఇచ్చాం. 84 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించామని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉందో బేరీజు వేసుకోవచ్చు.
రాష్ట్ర స్కిల్ డెవలప్ విధానాలను అప్పట్లో గుజరాత్ లో సిఐఏపి ప్రెసెంట్ చేస్తే.. అప్పటి గుజరాత్ సీఎం మోదీ వాటిని ప్రోత్సహించారు. కార్యాలయాలకు వెళ్లకుండా ఈ సేవ కేంద్రాల్లో ధ్రువ పత్రాలు అందించేలా చేసాను. సున్నా వడ్డీకి రుణాలు ఆంధ్ర లోగాని తెలంగాణ లోగాని జరుగుతున్నాయా..ఎక్కడ జరగడం లేదని మండిపడ్డారు. రైతులకు క్రాప్ లోన్ ఇప్పుడు ఇస్తున్నారా? ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సి, ఎస్టి లు 22శాతం ఉన్నారు వారికి సబ్ ప్లాన్ నిధులు ఇచ్చే వాళ్ళం.. ఇప్పుడు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రాజకీయంలో జరిగిన అంశాలు నచ్చక చాలా రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నాను. మళ్ళీ ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.అందుకనే కనుక రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.