స్వతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. రేపు 12వ తేదీ ఉ. 9 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో క్రోసూరుకు రానున్నారు. క్రోసూరు మోడల్ స్కూల్ లో జగనన్న విద్యాకానుక నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అనంతరం అమరావతి – బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.149 కోట్లతో అమరావతి – బెల్లంకొండ రోడ్ నిర్మాణం జరుగనుంది. అనంతరం మాదిపాడు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రూ.60 కోట్లతో కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగనుంది. అలాగే క్రోసూరులో రూ.7.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిని సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు.


