స్వతంత్ర వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 10వ తేదీన మాగుంట రాఘవను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆయనకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రెండు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం. అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు రాఘవ. బెయిల్ పిటిషన్‌ను అంగీకరించింది న్యాయస్థానం. మాగుంట రాఘవకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డికి కూడా ఇప్పటికే కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఆయన అప్రూవర్‌గా మారడంతో రాఘవకు ఊరట దక్కింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం.. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. వరుసగా సోదాలు, విచారణలు, అరెస్ట్‌లతో.. కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు ఈ కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి ఆప్రూవర్‌గా మారారు. అటు.. వరుసగా అరెస్టులు చేస్తూ.. సీబీఐ దూకుడు పెంచుతుండటంతో.. లిస్ట్‌లో ఉన్నవారి గుండెల్లో గుబులు రేగుతోంది.