స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత వివరాలను హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపింది. అధికంగా నల్గొండలో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. మహబూబాబాద్, కరీంనగర్ 45.5 డిగ్రీల సెల్సియస్, పెద్దపల్లి, ములుగు 45.2 డిగ్రీల సెల్సియస్, ఖమ్మం 45.1 డిగ్రీల సెల్సియస్, సూర్యాపేట , జయశంకర్ భూపాలపల్లి 45 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల 44.9 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్ గచ్చిబౌలి లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నగరంలో గచ్చిబౌలి మినహా మిగిలిన అన్ని చోట్ల 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.