స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. సుప్రీం కోర్టులో తను పిటిషన్ వేసిన విషయాన్ని తెలిపారు అవినాష్. రేపు తన పిటిషన్‌పై విచారణ ఉందని.. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా 27 వరకు మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు. ఆ తర్వాత సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని కోర్టుకు తెలిపారు.