స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: బీహార్ లో జన్ సురాజ్ పేరుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర చేస్తున్నారు. గతేడాది అక్టోబరు 2న ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆయన 2,500 కిమీపైగా నడిచారు. సుదీర్ఘ పాదయాత్ర కారణంగా ఆయన కాలికి గాయం కావడంతో పాదయాత్ర నిలిచిపోయింది. కాలును పరిశీలించిన డాక్టర్లు.. ఎక్కువ దూరం నడవడం వల్ల ఎడమకాలి కండరాలపై తీవ్ర ఒత్తిడి పడడంతో గాయంగా మారిందని తెలిపారు. తక్షణమే ఆయన మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో గాయంపై స్పందించిన ప్రశాంత్ కిశోర్.. కాలికి గాయం వల్ల పాదయాత్రకు విరామం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. జూన్ 11న పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు.