స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. కేపీహెచ్‌బీ కాలనీలోస్నేహితుడి గదిలో శ్యామ్ (24), జ్యోతి (22) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్పకు చెందిన శ్యామ్ అనే యువకుడు.. అదే గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన జ్యోతి.. గత 20 రోజులుగా కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్ లో ఉంటుంది. శ్యామ్ కూడా అక్కడే ఉంటున్నాడు. ఒకరోజు తన స్నేహితుడు కృష్ణ వద్దకు వచ్చాడు. కృష్ణ ఊరికి వెళ్తుండటం గమనించిన.శ్యామ్.. తాను రూమ్ లో ఉంటానని గది తాళాలు ఇవ్వాలని అడిగాడు. దీంతో కృష్ణ, గది తాళాలు ఇచ్చి ఊరికి వెళ్ళిపోయాడు. మూడు రోజుల క్రితం కృష్ణ రూమ్‌కు శ్యామ్, జ్యోతి వచ్చి అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం నుంచి ఆ రూమ్ లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూమ్ తలుపులు ఓపెన్ చేసిన పరిశీలించిన పోలీసులు… శ్యామ్ ఉరివేసుకుని.. యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. యువతికి గతంలోనే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.