స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగింపు పలికాయి. సెన్సెక్స్ 317.81 పాయింట్లు లాభపడి 62,345.71 వద్ద ముగిసింది. నిఫ్టీ 84.05 పాయింట్ల లాభంతో 18,398.85 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.30గా ఉంది. విప్రో, హెచ్‌సీఎల్, ఐటీసీ, టాటా మోటార్స్, టైటాన్, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఏషియన్ పేయింట్స్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, మారుతీ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.