స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. నిందితులు రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీరు విదేశాలకు వెళ్లకుండా ముగ్గురి పాస్‌పోర్టును సీజ్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మూడు నెలల వరకు సీట్ కార్యాలయంలో హాజరుకావాలనిఆదేశించింది.