స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో నీట్ పరీక్ష హాల్ లోకి వెళ్లే విద్యార్థులకు బయోమెట్రిక్ చెకింగ్ ప్రాసెస్ ఆలస్యం అవుతుంది. ఒకరితరువాత ఒకరు బయోమెట్రిక్ చేయడంతో ప్రాసెస్ కాస్త ఆలస్యం అవుతుంది. చాలా మంది విద్యార్థులు బయట క్యూ లైన్ లలో నిలబడి ఎదురు చూస్తున్నారు. మధ్యాహం 1.30 వరకు మాత్రమే లోపలికి అనుమతి ఉండడంతో విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.


