స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ మీషో(Meesho) మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మొత్తం 251 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్ చేసింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యామని చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన సిబ్బందికి 3 నుంచి 9 నెలల వేతనాన్ని పరిహారంగా అందజేస్తామన్నారు. వారి పదవి, పనిచేసిన కాలం, జీతం ఆధారంగా పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. అలాగే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడంలోనూ సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా గతేడాది కూడా 250మంది ఉద్యోగులను తొలగించింది.