Andhra Pradesh | ‘కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం.. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం’ అని వ్యాఖ్యానించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే మన ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ జగన్ తెలిపారు. కార్మికుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.