స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ గుండ్రంగా ఇంద్రధనస్సు ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఏర్పడిన అద్భుత దృశ్యాన్ని పలువురు తమ ఫోనల్లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇలా సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు ఏర్పడటాన్ని హాలో సన్ అని పిలుస్తుంటారు. సూర్యుడు కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడడం వర్షం పడడం లేదా మంచు కురవడానికి సూచికగా పేర్కొంటారు.
కొంత మంది మాత్రం ఇలా ఏర్పడడం అశుభమని చెబుతున్నారు. ఈ పుకార్లను ఖాగోళ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. దట్టమైన మేఘాలు సూర్యుడి చుట్టూ ఏర్పడినప్పుడు వాటిలోని నీటిబిందులపై సూర్యకిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందన్నారు. ఇలా ఏర్పడడాన్ని సైంటిఫిక్ పరిభాషలో 22-డిగ్రీ హలోస్ అని అంటారని తెలిపారు. సాధారణంగా భూమికి 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఏర్పడుతుందని వెల్లడించారు.


