Accedent | నిజామాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వేగంగా వస్తున్న డీసీఎం ఆటోని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి అక్కడకిక్కడే చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే క్షతగాత్రులకువెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. డీసీఎం వేగంగా ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్సిడెంట్ అయిన వెంటనే ఘటనాస్థలం నుంచి డీసీఎం డ్రైవర్ పరారయినట్లు తెలుస్తోంది. బోధన్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతిలు, క్షతగాత్రులు బోధన్ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు.


