Janesena Party | పోలవరం ప్రాజెక్టుని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని.. ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని స్పష్టం చేశారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పోలవరం విషయంలో ప్రభుత్వ చర్యలు కేవలం రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే విధంగా మాత్రమే ఉన్నాయన్నారు. పోలవరం నిర్వాసితులు, రైతుల పక్షాన జనసేన పార్టీ ప్రత్యేక పోరాటం చేస్తుందని తెలిపారు. వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టు సందర్శించి, అధికారులతో చర్చలు జరుపుతారని అన్నారు. పూర్తి సమాచారంతో వాస్తవాలు ప్రజల ముందు పెడతామన్నారు. అదే రోజు సాయంత్రం కొవ్వూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో జగన్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడతామన్నారు. ఈ మేరకు గురువారం భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు.