రాయలసీమను తెలంగాణలో కలపాలని మాజీ మంత్రి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కలిపితేనే రాయలసీమ నీటి సమస్య తీరుతుందని తెలిపారు. రాయలసీమను కలుపుకోవాల్సిన అవసరం తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉందన్నారు. రాయల తెలంగాణ కావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ఎన్నికల తర్వాత నేతలందరిని కలుస్తానని తెలిపారు జేసీ. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమన్నారు. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
కాగా గతంలో రాష్ట్ర విభజన సమయంలోనూ రాయల తెలంగాణ అనే డిమాండ్స్ వచ్చాయి. కొంతమంది సీమ కాంగ్రెస్ నేతలు దీనిపై పోరాటం కూడా చేశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రాయల తెలంగాణ అంశం జేసీ తెరపైకి తీసుకురావడం సంచలనంగా మారింది.