Tirumala Updates: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ఉదయం 11 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభించనున్నారు. స్వామి వారి కైంకర్యాల దృష్ట్యా శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధనను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఇవాళ తిరుమలలో ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చేస్తారు అధికారులు. అలాగే.. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 62,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 21,718 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.96 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.