స్వతంత్ర వెబ్ డెస్క్: ఒక వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని సెక్టార్ 11 నివాసిస్తున్న మహేంద్ర శర్మ.. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం శనివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తోటి ఆటగాళ్లతో కలిసి శర్మ బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. నోయిడా స్టేడియంలోని అత్యవసర వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని శర్మను బతికించేందుకు పీసీఆర్ చేశారు. అనంతరం అతన్ని హుటాహుటీన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐతే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇండోర్ స్టేడియంలో కుప్పకూలిన శర్మకు వైద్యులు పీసీఆర్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు సెక్టార్ 24 పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ ఆఫీసర్ అమిత్ కుమార్ మీడియాకు తెలిపారు.