తిరుపతి జిల్లా పల్లె వీధిలో వైసీపీ కార్యకర్తలు ఒక ఓటుకు 5వేల రూపాయలు పంపిణీ చేశారని మాజీఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. ఒక్క ఓటుకు 5వేలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. డబ్బులు యథేచ్ఛగా పంచుతుంటే జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నారన్నారు. జగన్‌కు బెయిల్ ఇచ్చి కేజ్రీవాల్‌కు ఎందుకు ఇవ్వలేదన్నారు. కేజ్రీవాల్ పట్ల మోదీ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తు న్నారన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదన్నారు. కేజ్రీవాల్ తప్పు చేస్తే సీఎంగా కొనసాగే అర్హత లేదా అన్నారు. ఏపీ సీఎం తప్పు చేస్తే సీఎంగా కొనసాగవచ్చా అని కోర్టు తీర్పులు గందరగోళానికి తెరతీస్తున్నాయన్నారు. కేజ్రీవాల్‌కు ఒక తీర్పు. జగన్‌కు మరో తీర్పా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సమాధానం చెప్పాలని చింతా మోహన్ ప్రశ్నించారు.


