బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు సమక్షంలో వైసీపీ, ఇతర పార్టీల నేతలు 40 మంది కమలం పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో బీజేపీ నిడదవోలు రూరల్ మండలం అధ్య క్షులు మాట్ల వెంకట దుర్గారావు ఆధ్వర్యంలో వారు కమలం తీర్థం తీసున్నారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం బీజేపీతోనే సాధ్యం అవుతుందని సోము అన్నారు. మనదేశ ఖ్యాతిని నలు మూలలా చాటిన ఏకైక వ్యక్తి మోదీ అని చెప్పారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుబాటి పురందేశ్వరి, కందుల దుర్గేష్‌ను గెలిపించాలని వీర్రాజు పిలుపునిచ్చారు.