Tirumala | ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 56,680 మంది భక్తులు దర్శించుకున్నారు.. అలాగే 18,947 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, వైకుంఠవాసుడి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి గుడ్ న్యూస్ తెలిపింది. నేడు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నట్లు వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు జూలై మాసంకు సంబంధించిన అంగ ప్రదక్షణ టోకేన్లు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది. అలాగే… మధ్యాహ్నం 3 గంటలకు మే నెలకు సంబంధించిన వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది.


