సభ్యసమాజం తలదించుకునే ఘటన ఇది. చిట్టి చిట్టి పలుకులు పలికే చిన్నారిపై అఘాయిత్యం చేశాడో కామాంధుడు. పొరుగున ఉండే ఓ యువకుడి చేతిలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘోరం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. అత్యాచారానికి గురైన 5 ఏళ్ల బాలిక ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఫిబ్రవరి 22న శివపురి జిల్లాలో జరిగిన ఈ సంఘటనలో ఆ చిన్నారికి తీవ్ర అంతర్గత గాయాలు. శరీరంపై గాటు గుర్తులు, తలపై గాయాలు, జననేంద్రియాలకు 28 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు.
సభ్య సమాజం తలదించుకునే ఘోరం
ఫిబ్రవరి 22 సాయంత్రం బాలిక కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రెండు గంటల తర్వాత వారి నివాసానికి కొద్ది దూరంలో ఉన్న ఒక పాడుబడిన ఇంటి టెర్రస్‌పై అపస్మారక స్థితిలో రక్తస్రావంతో బాలిక పడి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న 17 ఏళ్ల యువకుడు ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఆమెపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. గ్వాలియర్ కమలరాజా ఆసుపత్రిలో బాలికకు చికిత్స చేస్తున్న వైద్యుల ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి ఆమె తలను గోడలకు, నేలకు పదే పదే కొట్టి, ఆమె ముఖం, శరీరాన్ని కొరికి, ఆమె ప్రైవేట్ భాగాలు దాదాపు రెండుగా చీలిపోయేంతగా తీవ్రంగా గాయపరిచాడని వైద్యులు చెప్పారు..
తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానిక కమలారాజా ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సర్జన్లు రెండు గంటల పాటు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. కృత్రిమ మలద్వారం పెట్టడానికి వైద్యులు ఆమె పెద్ద ప్రేగును కత్తిరించాల్సి వచ్చింది మూత్ర కాథెటర్‌ను ఇన్‌సర్ట్ చేశారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు శివపురిలో బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, బీజేపీ, కాంగ్రెస్ నేతలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.