Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

అసలు రైతుల డిమాండ్లు ఏమిటి ?

  మూడేళ్ల కిందట ఢిల్లీ శివార్లలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. రైతుల బతుకులు బుగ్గిపాలు చేసే మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే అప్పట్లో రైతుల ప్రధాన డిమాండ్. ఈ వ్యవసాయ చట్టాల్లో ఎక్కడా పంటలకు కనీస మద్దతు ధర అనే ప్రసక్తే లేదు. కనీస మద్దతు ధర డిమాండ్‌కు కేంద్రం అంగీకరించకపోవడం తో అన్నదాతలు ఆగ్రహించారు. ఉద్యమం బాటపట్టారు. ఉద్యమంలో భాగంగా ఢిల్లీ శివార్లలో రైతులు చిన్న చిన్న గుడారాలు వేసుకున్నారు. కన్నతల్లి లాంటి పుట్టిన ఊరును వదులుకుని ఎక్కడో హస్తిన శివార్లలోని గుడారాల్లో నెలల తరబడి ఉంటూ కేంద్రంపై పోరాటం మొదలెట్టారు. కేంద్రం ముందు డిమాండ్ల చిట్టా విప్పారు. అయితే అన్నదాతల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది. అయినప్పటికీ రైతన్నలు మనోధైర్యం కోల్పోలేదు. దీర్ఘకాలిక పోరాటాలకు సన్నద్ధమయ్యారు.

      రైతు కూలీల పెన్షన్ అనేది అన్నదాతలు చేసిన మరో డిమాండ్. అరవై ఏళ్లు నిండిన రైతులకు అలాగే రైతు కూలీలకు నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు, కూలీల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు పెన్షన్ అవసరమని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. పంటలకు రాయితీలు పెంచాలనేది రైతు సంఘాలు చేస్తున్న మరో డిమాండ్. విద్యుత్, ఎరువులు, విత్తనాలు వంటి వాటిపై రాయితీలు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలికాలంలో వ్యవసాయ ఖర్చులు ఎడాపెడా పెరిగాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పంటలకు రాయితీలు పెంచడం ద్వారా అన్నదాతలపై ఆర్థిక భారం తగ్గుతుందని రైతు సంఘాలు భావిస్తున్నాయి. వీటన్నిటితో పాటు 2013నాటి భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూ సేకరణ చట్టం ఫలితంగా దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర అన్యాయానికి గురవు తున్నారని సంఘాలు పేర్కొంటున్నాయి. భూసేకరణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని రైతుల భూములను కార్పొరేట్ సంస్థల కోసం సర్కార్ లాక్కుంటుందని రైతు సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు.

   ఇదిలా ఉంటే భారతదేశ వ్యవసాయరంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అంతకుముందు చెప్పారు. నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్య రైతాంగలోకంలో దుమారం రేపింది. వ్యవసాయంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కల్పించడం అంటే సేద్యాన్ని హోల్‌సేల్‌గా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడమే తప్ప మరోటి కాదు. పార్లమెంటులో కనీసం చర్చ కూడా జరపకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు ప్రవేశపెట్టారు. తమ బతుకులను బుగ్గిపాలు చేసే వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయితే రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎత్తులు, పై ఎత్తులు వేసింది. ఒక దశలో ఖలిస్తానీ తీవ్రవాదులతో రైతులకు సంబంధాలు ఉన్నాయని కేంద్రం ఆరోపణలు చేసింది. ఖలిస్థానీ బూచి చూపించి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి చేసిందంతా చేసింది. అయితే కేంద్రం చేసిన ఆరోపణలను దేశ ప్రజలెవరూ నమ్మలేదు. రైతాంగ ఉద్యమంలోని నిజాయితీని ప్రజలు విశ్వసించారు.

  రోజులు గడిచేకొద్దీ, రైతులు డీలా పడతారని ప్రభుత్వం భావించింది. ఉద్యమం నీరుగారిపోతుందని సర్కార్ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే అలా జరగలేదు. ఉద్యమిస్తున్న రైతులు మరింతగా రాటుదేలారు. మరోవైపు రైతాంగ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక భీష్మించుకుకూర్చుంటే అసలుకే మోసం వస్తుందని ఢిల్లీ పెద్దలకు గ్నానోదయం అయింది.చివరకు వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏమైనా ఢిల్లీ శివార్లలో పదకొండు నెలల పాటు జరిగిన రైతుల ఆందోళన …మనకాలపు మహోద్యమంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇదిలాఉంటే, రాకేష్ తికాయత్ వ్యవహారశైలి తాజాగా తెర మీదకు వచ్చింది. రాకేష్ తికాయత్ …దేశంలో ఒక ప్రముఖ రైతు నాయకుడు.దేశంలో ఎక్కడ రైతాంగ పోరాటాలు జరిగినా, అక్కడ రాకేష్ తికాయత్ హాజరవుతారు. రైతుల సమస్యలపై ఊదరగొడ తారు. అయితే దాదాపు పది రోజులుగా పంజాబ్- హర్యానా సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనల్లో రాకేష్ తికాయత్ ఎక్కడా కనపడడం లేదు. రైతులు ఇంత పెద్ద ఉద్యమం చేస్తుంటే, రాకేష్ తికాయత్ హాజరుకాకపోవడంపై రకరకాల వార్తలొస్తున్నాయి.

   ఏమైనా ఇప్పటికైనా దేశవ్యాప్తంగా 15 కోట్లకుపైగా ఉన్న రైతులు, రైతుకుటుంబాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటి కైనా న్యాయం చేయాలని సామాజిక శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ప్రతి సీజన్‌లో ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కు కనీస మద్దతు ధర కోసం వెంపర్లాడే దుస్థితి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ హయాంలో ప్రతిసా రి అన్యాయానికి గురవడంతోనే, ఈసారి కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి అన్నదాతలు మరోసారి ఆందోళనబాట పట్టారు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్