22.9 C
Hyderabad
Sunday, February 22, 2026
spot_img

26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు అస్వస్థత.. కారణం అదే

స్వతంత్ర వెబ్ డెస్క్: ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో 26 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రాంతంలోని SRIT ఇంజినీరింగ్ కాలేజీ హస్టల్లో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి హాస్టల్ లో భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో రాత్రి భోజనం కోసం చేసిన గుడ్డు, టమోటా రైస్, పెరుగన్నం తిన్నారు విద్యార్థులు. ఆ తరువాత ఒకేసారి విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని అనంతపురంలోని అమరావతి ఆసుపత్రికి తరలించారు. అయితే వీరుల్ని ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. వీరితో పాటు మరికొందరు విద్యార్థులు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిని హాస్టల్‌ వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్