స్వతంత్ర వెబ్ డెస్క్: ఫుడ్ పాయిజన్ కావడంతో 26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రాంతంలోని SRIT ఇంజినీరింగ్ కాలేజీ హస్టల్లో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి హాస్టల్ లో భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో రాత్రి భోజనం కోసం చేసిన గుడ్డు, టమోటా రైస్, పెరుగన్నం తిన్నారు విద్యార్థులు. ఆ తరువాత ఒకేసారి విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని అనంతపురంలోని అమరావతి ఆసుపత్రికి తరలించారు. అయితే వీరుల్ని ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. వీరితో పాటు మరికొందరు విద్యార్థులు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిని హాస్టల్ వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు అస్వస్థత.. కారణం అదే
Latest Articles
- Advertisement -