VTPS Vijayawada |ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఉన్న విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్టిపీసీ ఐదవ ఫేజ్ నిర్మాణ పనుల కోసం ఓ లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. నిర్మాణ దశ పూర్తిగా చివరి దశకు రావడంతో పై భాగంలో పనులు చేసేందుకు లిఫ్ట్ లో ఉదయం 15 మంది కార్మికులు పైకి వెళుతున్నారు. ఈ క్రమంలో నాలుగో ఫ్లోర్ వద్ద లిఫ్ట్ కు అంతరాయం కలిగింది. దీంతో ఆందోళన చెందిన కార్మికులు తలుపులు తీసుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.
అయితే బరువుకి వైర్లు తెగడంతో ఒక్కసారిగా లిఫ్టు కిందకి పడిపోవడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. లిఫ్ట్ పూర్తిగా తొలగించిన తర్వాత కానీ.. కింద ఎంతమంది ప్రమాదంలో చిక్కుకున్నారో వారిని అంచనాకు రావడం కష్టంగా ఉందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని ఎన్టీపీసీ లోని ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
Read Also: శాసనసభలో గందరగోళం.. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
Follow us on: Youtube Instagram