స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీ టెన్త్ ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 10 వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యంత తక్కువ వ్యవధిలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. గత ఏడాది 28 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేయగా.. ఈ ఏడాది 18 రోజల వ్యవధిలో ఫలితాలు విడుదల చేస్తున్నామని తేలిపారు. ఎక్కడా ఏ విధమైన లీకేజి లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని బొత్స తెలిపారు.