ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధిష్టానం ఇంఛార్జ్‌ల్లో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు స్థానాలను మార్చిన హై కమాండ్ ఐదో జాబితా సిద్ధం చేస్తోంది. వరుసగా విడుదలవుతున్న జాబితాల్లో సీటు దక్కని నేతలు అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీ పీకి, పదవికి రాజీనామా చేశారు. నరసరావు పేట ఎంపీ అభ్యర్థిగా మరో వ్యక్తిని పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. కృష్ణ దేవరాయలును గుంటూరు నుంచి బరిలో దించే యోచనలో ఉంది. అయితే తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తాన ని అధిష్టానానికి తేల్చి చెప్పారు కృష్ణ దేవరాయలు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఏర్పడి న రాజకీయ అనిశ్చితికి తాను తెర దించాలని భావిస్తున్నట్లు కృష్ణ దేవరాయలు చెప్పారు. రాజకీయ అనిశ్చితికి తాను బాధ్యుడిని కాదన్నారు.


