తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అయితే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు వరుసగా కౌంటరిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్ దాటిన ఎవరిపైన అయినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సహజమని మధుయాష్కీ అన్నారు.
తనకైనా, చిన్నారెడ్డి కైనా , రేవంత్ రెడ్డికి అయినా ఒకే చర్యలు ఉండాలని ఈ సందర్భంగా అన్నారాయన. మల్లన్న రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని.. రేవంత్ రెడ్డి పీసీపీ చీఫ్ కావాలనుకున్న వారిలో మల్లన్న కూడా ఒకరని తెలిపారు. ఇక మల్లన్న లేవనెత్తుతున్న అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డిదేనని అన్నారు.
పార్టీలకు, బీసీలకు ఒక న్యాయం , ఇతరులకు ఒక న్యాయం జరుగుతుందని తాను భావించడం లేదని మదుయష్కీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మల్లన్న లెవనెత్తుతున్న అంశాలపై పీసీసీ కూడా క్లారిటీ ఇవ్వాలని కోరారు. అయితే కులగణన విషయంలో రాహుల్ గాంధీ చిత్తశుద్ధి తో ఉన్నారని మాత్రం మధుయాష్కీ క్లారిటీ ఇచ్చారు.