29.2 C
Hyderabad
Sunday, November 3, 2024
spot_img

భారత్ చాలా స్మార్ట్ గా డీల్ చేస్తోంది… నిక్కీ హేలీ

       అమెరికాలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు నిక్కీ హేలి. ఇటీవల ఫాక్స్ బిజినెస్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆమె భారత్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా భారత్ అమెరికాకు భాగ్య స్వామిగా ఉండాలకుంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచానికి అమెరికా అగ్రరాజ్యంగా పెద్దన్న పాత్ర పోషించ డంతో భారత్ కి అమెరికా పట్ల సరైన విశ్వాసం లేదని ఫాక్స్ బిజినెస్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే భారత్ రష్యాకు అత్యంత సన్నిహితంగా ఉంటూ తన ప్రపంచంలో తన ప్రాభల్యాన్ని కాపాడుకుంటుందని పేర్కొన్నారు.

ఒక సమయంలో అమెరికా తరపున తాను భారత్ వ్యవహారాలను చూశానని చెప్తారు. అంతేకాదు ప్రధాని మోదీతో మాట్లాడారు. ఆ సందర్భంలో వారు రష్యాతో కన్నా అమెరికాతో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. కానీ ప్రస్తుతానికి అమెరికా విధానాలపైనా వారికి ఎలాంటి నమ్మకం లేదు. వాస్తవానికి అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే అమెరికా చాలా బలహీనంగా ఉందని వారు భావిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే భారత్ కు భారీ ఎత్తున ఆయుధా లను అందించే రష్యాతో సన్నిహితంగా ఉంటున్నారని హేలీ ఫాక్స్ బిజినెస్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

      ప్రపంచంలో అభివృద్ధి చెందిన మధ్య ప్రాచ్య దేశాలపైనే అమెరికా దృష్టి పెంట్టిందని హేలీ తెలిపారు. వాస్తవానికి ఇతర దేశాలతోనూ అమెరికా సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవరసరం ఉందని పేర్కొన్నారు. అప్పుడు మాత్ర మే అమెరికాతో మిత్రదేశాలైన ఆస్ట్రేలియా , ఇజ్రాయెల్ , జపాన్ దక్షిణ కొరియా , న్యూజిలాండ్ , భారత్ వంటి పలు దేశాలు కలుస్తాయని తెలిపారు.ఈ సందర్భంగా చైనా ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సుస్థిరంగా లేదని తెలిపారు. రాబోయే కాలంలో చైనా ప్రభుత్వం నియంతృత్వ ధోరణకి మారుతోందని అభిప్రాయపడ్డారు. అయితే గత కొంతకాలంగా చైనా అమెరికాతో యుద్ధాన్ని కోరుకుంటుందని, చైనా ఆలోచనా విధానంలో అది పెద్ద తప్పని హేలీ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే నెవడా రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రైమరీలో నిక్కీ హేలీ ఓటమిపాలయ్యారు. రేసులో ఆమె కంటే ముందున్న డోలనాల్డ్ ట్రంప్ పోటీ చేయలేదు. హేలీకి దాదాపు 31 శాతం ఓట్లు వస్తే ….63 శాతం నోటాకు వచ్చాయి. నెవడాలో 1975 ఓ నోటాను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటమిని చవిచూసిన ఏకైక అభ్యర్థి హేలీయే అంతర్జా తీయ మీడియా ప్రకటించింది. హేలీ సొంతరాష్ట్రమైన దక్షిణ కరోలినాలో ఈ ఫిబ్రవరి 24 ఫ్రైమరీ ఎన్నికలు జరగను న్నాయి. వాటిలో ట్రంప్ నిక్కీ హేలీలు పోటీ పడుతున్నారని తెలిసింది.

Latest Articles

‘ధూం ధాం’ ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్