26.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

బైజూస్ కుంభకోణంపై విద్యార్థి సంఘాల తిరుగుబాటు

        కార్పొరేట్ విద్యా వ్యవస్థ వేళ్లూనుకున్న తరుణంలో విద్యాసంస్థల స్వరూపాలు మారిపోయాయి. ఆన్ లైన్ పాఠాల జోరు పెరిగింది.ఈ క్రమంలో విద్య పేరుతో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్న సంస్థలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విద్యా రంగాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న బైజూస్ ను రాష్ట్రంలో నిషేధించాలంటూ గుంటూరులో విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు తెలిపారు. ఏఐవైఎఫ్ , ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బైజూస్, ఆకాశ్ విద్యా శిక్షణ కేంద్రాల వద్ద నిరసనలు చేపట్టారు.
ఈ ఆందోళనల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి వలీ పాల్గొన్నారు. అర్థం కాని చదువులతో  విద్యార్థుల భవితవ్యం పూర్తిగా దెబ్బతింటుందని, బైజూస్ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని విమర్శించారు. ట్యాబ్ ల పంపిణీలో బైజూస్ కుంభకోణం జరిగిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిం చారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బైజూస్ చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకా రులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీస్ వాహనాల్లో ఎక్కించుకు వెళ్లారు .

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్