ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ కూడా ఆయనను బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకొంటున్నారు. అనారోగ్య కారణాలతో గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరుకాలేకపోతున్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.