నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసింది. మొత్తం 53 మంది మృతి చెందారు. నేపాల్ సరిహద్దుకు సమీపంలో టిబెట్‌లో 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 53 మంది మరణించారని చైనా మీడియా జిన్హువాను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP తెలిపింది. బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ సహా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.
నేపాల్ భౌగోళికంగా భూకంపం సంభవించే ప్రాంతంలో ఉంది, ఇక్కడ భారతీయ, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొని, హిమాలయాలను ఏర్పాటు చేశాయి. అందుకే ఇక్కడ భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. 2015లో, నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు, 22,000 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 5 లక్షలకు పైగా గృహాలు ధ్వంసమయ్యాయి.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం, భూకంపం ఉదయం 6:35 గంటలకు నమోదైంది. మొదటి భూకంపం వచ్చిన కొద్దిసేపటికే ఈ ప్రాంతాన్ని మరో రెండు భూకంపాలు తాకినట్లు NCS డేటా వెల్లడించింది.