స్వతంత్ర, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో జమ్మూకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7తీవ్రతగా నమోదైంది. దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కి.మీల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తొలుత జమ్మూలో తీవ్ర ప్రకంపనలు రాగా దీని ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాదిన పలు పాంత్రాల్లోనూ భూమి కంపించింది. పది సెకన్ల పాటు ఈ ప్రకంపనలు ఉండడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.